Tuesday, August 5, 2008

వేడుకల చందమామ














చందమామ ఈ లోకంలోకి రాక ముందే శ్రీమంతపు వేడుక

ప్రతి ఇంటిలో పిల్లలు పుట్టటమే పెద్ద వేడుక

పుట్టిన తరువాత ఇక వేడుకలకు కొదవ ఏముంది

చిన్నితల్లి నన్ను మూడు పదుల వెనుకకు తీసుకు వెళ్ళింది

ఒక సారి ఆ వేడుకలన్నీ గుర్తు తెచ్చుకుందాం

ముందుగా వచ్చే వేడుక బారసాల, నామకరణం

రెండవది ఊయలలో వేయటం

మూడవ నెల రాగానే ముద్దకుడుములు, చలిమిడి పంచి పెట్టటం

నవ్వులకు నువ్వుండలు పంచటం

ఉంగాలు కొట్టినపుడు ఉగ్గు గిన్నెలు ఇవ్వటం

బోర్లా పడితే బొబ్బట్ట్లు చేయటం

పాకుతున్నప్పుడు పరమాన్నము వండటం

తరువాత వచ్చేది అన్నప్రాసన

అల్లరి చేస్తున్నప్పుడు చిల్లర డబ్బులు పంచటం

ఇంకా బుల్లిబుల్లి నడకలు వస్తున్నప్పుడు అరిసెలు పంచటం

ఈ బంగారు చిన్నారులు చిలకపలుకులు పలికినపుడు పంచదార చిలకలు పంచటం

పుట్టు వెంట్రుకలు తీయటం

సంక్రాంతికి భోగి పండ్లు పోయటం

ఇంకో పెద్ద పండుగ పుట్టిన రోజు వుండనే వుంది

అబ్బో.. అబ్బో.. ఎన్ని వేడుకలు!! ఎన్ని వేడుకలు!!

మన సంస్కృతి ఎంత గొప్పది

ఈ వేడుకలన్నిటి వెనుక ఎంత పరమార్ధం వుంది

మానవులకు వేడుకల రూపేణా మన దగ్గర వున్నది పంచటం నేర్పుతుంది

ఓ చిట్టి తల్లీ!! ఈ పండుగలన్నీ నీ పెదనాన్న, నాన్న చేసుకున్నట్లు నువ్వు కూడా చేసుకొని వాళ్ళంత గొప్పదానివై..
ప్రతి రోజూ ఒక పండుగ రోజై..
వేడుకల చందమామవై ..
వెలుగు తల్లి..వెలుగు తల్లి..వెలుగు తల్లి

No comments: