Wednesday, August 6, 2008

పురవి...అమ్మ పుట్టినరోజు

ఈ రోజు చిన్ని తల్లి వాళ్ళ అమ్మ పుట్టినరోజు పండుగ చేసింది

ప్రొద్దునే లేచి చేతులు చాచి తన చిరు నవ్వుల పువ్వులతో పెద్ద బొకే ఇచ్చి

ఉంగా.. ఉంగా ..ఉంగా..అంటూ "నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మా" అని చెప్పింది

కూతురిని చూసుకొని చైతన్య కళ్ళల్లో ఎంత వెలుగో !!

అంతేకాదు అమ్మను మురిపించాలని కాబోలు

ఈరోజు కొత్తగా కూర్చోవటం, కేరింతలు కొట్టటం

అంతేకాదు "ఆ ఆ ఆ ఆ ఆ" అని పుట్టినరోజు పాటలు కూడా పాడేస్తుందండోయ్

మళ్ళీ మా అందరికీ పార్టీ ఇచ్చింది

చైతూ ఎంత అదృష్టవంతురాలు..

బుల్లి మేధమ్మ వాళ్ళ అమ్మకు పుట్టినరోజు పండుగ చేసింది

గోరంత దీపం కొండలకు వెలుగు

గోపాల కృష్నయ్య గోవులకు వెలుగు

మాడంత దీపం మేడలకు వెలుగు

మా చిన్నారి మేధమ్మ అమ్మ కంటి వెలుగు

Tuesday, August 5, 2008

వేడుకల చందమామ














చందమామ ఈ లోకంలోకి రాక ముందే శ్రీమంతపు వేడుక

ప్రతి ఇంటిలో పిల్లలు పుట్టటమే పెద్ద వేడుక

పుట్టిన తరువాత ఇక వేడుకలకు కొదవ ఏముంది

చిన్నితల్లి నన్ను మూడు పదుల వెనుకకు తీసుకు వెళ్ళింది

ఒక సారి ఆ వేడుకలన్నీ గుర్తు తెచ్చుకుందాం

ముందుగా వచ్చే వేడుక బారసాల, నామకరణం

రెండవది ఊయలలో వేయటం

మూడవ నెల రాగానే ముద్దకుడుములు, చలిమిడి పంచి పెట్టటం

నవ్వులకు నువ్వుండలు పంచటం

ఉంగాలు కొట్టినపుడు ఉగ్గు గిన్నెలు ఇవ్వటం

బోర్లా పడితే బొబ్బట్ట్లు చేయటం

పాకుతున్నప్పుడు పరమాన్నము వండటం

తరువాత వచ్చేది అన్నప్రాసన

అల్లరి చేస్తున్నప్పుడు చిల్లర డబ్బులు పంచటం

ఇంకా బుల్లిబుల్లి నడకలు వస్తున్నప్పుడు అరిసెలు పంచటం

ఈ బంగారు చిన్నారులు చిలకపలుకులు పలికినపుడు పంచదార చిలకలు పంచటం

పుట్టు వెంట్రుకలు తీయటం

సంక్రాంతికి భోగి పండ్లు పోయటం

ఇంకో పెద్ద పండుగ పుట్టిన రోజు వుండనే వుంది

అబ్బో.. అబ్బో.. ఎన్ని వేడుకలు!! ఎన్ని వేడుకలు!!

మన సంస్కృతి ఎంత గొప్పది

ఈ వేడుకలన్నిటి వెనుక ఎంత పరమార్ధం వుంది

మానవులకు వేడుకల రూపేణా మన దగ్గర వున్నది పంచటం నేర్పుతుంది

ఓ చిట్టి తల్లీ!! ఈ పండుగలన్నీ నీ పెదనాన్న, నాన్న చేసుకున్నట్లు నువ్వు కూడా చేసుకొని వాళ్ళంత గొప్పదానివై..
ప్రతి రోజూ ఒక పండుగ రోజై..
వేడుకల చందమామవై ..
వెలుగు తల్లి..వెలుగు తల్లి..వెలుగు తల్లి

Monday, August 4, 2008

జేజమ్మ బంగారం
















జేజమ్మ బంగారం

చిన్ని తల్లే మో అమెరికాలొ

జేజమ్మేమో ఇండియాలో

వీళ్ళ మధ్య అంతులేని ఫొను కబురులు

మహానుభావుడు గ్రాహం బెల్ గారు ఈ ఫోను కని పెట్టబట్టి గాని...

లేకపొతే మనమంతా ఏమి అయి పొయే వాళ్ళ మో !

ఎందరి మనసులు దగ్గర చెసిందీ ఫోను

గ్రాహం బెల్ గారికి మరోసారి వందనాలు

ఇక తాతమ్మ మనమరాలు ఏమి కబురులు చెప్పుకుంటున్నారో ?

భాగవతం లోని క్రిష్ట్న లీలలన్ని చెప్పుకుంటున్నా రేమో

భగవంతుడు స్త్రీకి తల్లి అవగానే ఒక కిరీటం పెడతాడట

ఆ బిడ్డకూదా తల్లి అవగానే రెండో కిరీటం పెదతాడట

ఆ బిడ్డ మరో బిడ్డకు జన్మ నివ్వగానే మూడో కిరీటం పెదతాడంట

ఎంత గొప్ప భావన..!...

మూడు కిరీటాలతో జేజమ్మ ముత్తాత అ యి నందుకు తాతగారు

ఎంత ఆనందముతో వెలిగిపోతున్నారో

ఈవయుసులో వాళ్ళకు ఇంతకంటే ఏమి కావాలి

ఈ పెద్దవాళ్లు ఎంత ధన్యులు


వాళ్ళ దేవనెలు నీకు శ్రీ రామరక్ష శ్రీ రామ రక్ష

మనమెంత అద్రుస్టవంతులం

ఈ తరం వాళ్ళ కు కూడా వాళ్ళ ఆశీస్సులు అందుతున్నాయ

ఓ భగవంతుడా వాళ్ళకు మరో నిండు నూరేళ్ళు అయిష్షు ప్రసాదించు

ఇక ఈ బంగారు తల్లిని ఎప్పుడు ఎప్పుడు చూస్తమా అని వాళ్ళకు ఆత్రుత

ఓ జేజమ్మా నీకోసం మరో ఆరు నెలల్లొ వచ్చేస్త వచ్చేస్త

నువ్వు నా కోసం దాచి పెట్టినవన్ని దోచుకొనిపోత

ఓ బంగారు తల్లీ

మరి బులిబులి నడకలు

బులిబులి నడకలు

వడివడిగా నెర్చుకొని

బంగారు అందెల గజ్జెలు

ఘల్లు ఘల్లు మ్రోగ

ఘల్లు ఘల్లు మ్రోగ

చిరు హంస నడకల

కదలి రావే తల్లి మా బంగారు తల్లి

కదలి రావే తల్లి మా బంగారు తల్లి

కదలిరావే తల్లి మా బంగారు తల్లీ

Sunday, August 3, 2008

అమ్మకో అపరంజిబొమ్మ
















అమ్మకో అపరంజిబొమ్మ

కూతురు పుట్టగానే రాత్రీ పగలు మరచిపొయిన తల్లి మా చైతన్య
అసలే మనసు వెన్న..మరి కరిగిపోదా కూతురి ఆలనా పాలనలో
కూతురిని చూసుకుంటూ ప్రేమ సంద్రమే అవుతుందే!!

మరి అవ్వదా??

తల్లులు అందరి మనస్సూ ఒక్కటే కదా

తనేమో విద్యల ఘని అయిదు గోల్డ్ మెడల్స్ తెచ్చుకుంటే..

కూతురు ఇంకా ఎక్కువ తెచ్చుకోవాలని కాబోలు

ఈ అపరంజిబొమ్మకు మేధ అని పేరు పెట్టుకుంది

ఇక ఆ చిన్ని తల్లిని చాల గొప్పదానిగా తీర్చిదిద్దాలని
చాలా క్రమశిక్షణగా మంచి హృదయం ఉన్న దానిగా పెంచాలని
ఇంకా ఎన్నెన్నో కలలు

ఎంత స్వార్ధం ... ఎంత స్వార్ధం !!

తల్లి మనసు కదా !!!

తల్లులందరికీ దేవుడు ప్రేమతోపాటు ఇంత స్వార్ధం కూడా ఇచ్చాడే
అమ్మను చూడగానే చిన్ని తల్లి గారాలు చూడాలీ

ఎత్తుకోకపోతే అమ్మ మీద అలకలు, కోపాలు

ఈ మధ్య అరుపులు కూడ అరుస్తోందండోయ్

నోరు లేని చైతుకి ఇంత గడుసు కూతురా!!

మా చైతన్యకి కూతురు ఒక అపరంజిబొమ్మే

ఎత్తుకుంటేనే కూతురు కందిపోతుంది అనుకుంటుందే!!

దానికి చిన్న నలత వచ్చినా తల్లడిల్లిపొతుందే !!
కూతురు తప్పితే మరేది గుర్తుండదే

ప్రపంచంలో ఇన్ని గొప్ప గొప్ప విషయాలు కనిపెట్టారు
తల్లి ప్రేమకు కొలమానం కనిపెట్టారా??

ఎప్పటికీ కనిపెట్టలేరు కూడా అలాంటిది మరి అమ్మ ప్రేమ అంటే

చిట్టి తల్లీ!!

అమ్మ ప్రేమ, అందరి ప్రేమ నీకు రక్షగా

అందరి అశీశ్సులతో దిన దిన ప్రవర్ధమానమై.. ఎదగవమ్మా...
అపరంజిబొమ్మా

నాన్నారి అమ్మా

తాతగారి జాబిలమ్మా

నానమ్మ చందమామా

ఎదగవమ్మా... ఎదగవమ్మా... ఎదగవమ్మా

Saturday, August 2, 2008

అభిప్రాయములు

మీ అభిప్రాయములు ఇవ్వగలరు...
ratnalabburi@gmail.com

Thursday, July 31, 2008

నాన్నారి అమ్మ
















ఈ బంగారు తల్లిని రోజూ చూడటానికి కుదరని జాబు వాళ్ళ నాన్నకు

మూడు రోజులకు ఒకసారి కూతురిని చూడగానే

అమ్మా!! నేను ఎంత మిస్ అవుతున్నాను అనుకుంటాడు

అమ్మా..అమ్మా..అమ్మా..అని తప్పితే కూతురిని ఇంకో పిలుపుతో పిలవడే

అబ్బో మా వంశీ ఎంత పెద్దవాడయ్యాడు

వాడికో కూతురు బాధ్యతలు..

వాడికిఅమ్మను మరపించే మరో చిన్ని అమ్మ దొరికింది
దాన్ని చూడగనే వాడి కళ్ళల్లో ఎంత ఆనందమో

నాన్నను చూడగానే దాని కేరింతలు చూడాలీ..

వాహ్!! దానికి వాళ్ళ నాన్న అని ఎలా తెలుసో ??

అబ్బా!! ఈ శృష్టి ఎంత విచిత్రమైంది!!పిల్లలకు ఎన్ని నేర్పిస్తుంది

ఓ చిన్ని తల్లీ!! మీ నాన్న వచ్చాడు

దాచుకున్న కబురులన్నీ చెప్పేస్తున్నావా..............

చెప్పి చెప్పి అలసిపోయావేమో

నాన్న ఒడి అమ్మవలె వెచ్చనమ్మా

అల్లరి మాని పాలు తాగి

అలుపుతీర బజ్జోమ్మ..

నాన్నారి అమ్మా...

అందాల బొమ్మా...

మా చిన్నారి అమ్మా.....

Wednesday, July 30, 2008

తాతగారి జాబిలమ్మ
















అందరినీ తెల్లవారగానే సూర్యుడు పలకరిస్తే

మా అందరినీ మాత్రం మా చందమామ నవ్వులతో పలుకరిస్తుంది

ఎవరో కవి అన్నట్లు పగలే వెన్నెల అంటే ఇదేనేమో !!

ఇక తాతజీని చూడగానే దాని కేరింతలు మా అందరినీ ఆశ్చర్యపరుస్తాయి

ఇక ఆ తాతాజీకేమో ఏనుగు ఎక్కినంత సంబరం

ఆ సంబరంలో ఆయన వుండగానే చేతులుచాచి చంకెక్కుతుందే..

అప్పుడుచూడాలి ఎత్తుకోలేక ఆ తాతగారి తిప్పలు

ఇక ఆ తాతాజీ మనుమరాలికి పెట్టుకున్న ముద్దు పేరేమిటంటే..

"కన్నలు "

ఈ బంగారుతల్లి తాతగారిలొ ఏంత మార్పు తెచ్చింది

వావ్!!రావుగారిని చెవులు పట్టి ఆడించే మనవరాలు పుట్టిన్..దీ .....

కన్నలమ్మ.. ఓ కన్నలమ్మ..నా చిన్ని కూనలమ్మ..

తాతగారి జాబిలమ్మ ..మా ఇంటి యువరానివమ్మ..

అల్లరిచేయక బజ్జోమ్మ..మరి బజ్జోమ్మ..ఇక బజ్జోమ్మ