Thursday, July 31, 2008

నాన్నారి అమ్మ
















ఈ బంగారు తల్లిని రోజూ చూడటానికి కుదరని జాబు వాళ్ళ నాన్నకు

మూడు రోజులకు ఒకసారి కూతురిని చూడగానే

అమ్మా!! నేను ఎంత మిస్ అవుతున్నాను అనుకుంటాడు

అమ్మా..అమ్మా..అమ్మా..అని తప్పితే కూతురిని ఇంకో పిలుపుతో పిలవడే

అబ్బో మా వంశీ ఎంత పెద్దవాడయ్యాడు

వాడికో కూతురు బాధ్యతలు..

వాడికిఅమ్మను మరపించే మరో చిన్ని అమ్మ దొరికింది
దాన్ని చూడగనే వాడి కళ్ళల్లో ఎంత ఆనందమో

నాన్నను చూడగానే దాని కేరింతలు చూడాలీ..

వాహ్!! దానికి వాళ్ళ నాన్న అని ఎలా తెలుసో ??

అబ్బా!! ఈ శృష్టి ఎంత విచిత్రమైంది!!పిల్లలకు ఎన్ని నేర్పిస్తుంది

ఓ చిన్ని తల్లీ!! మీ నాన్న వచ్చాడు

దాచుకున్న కబురులన్నీ చెప్పేస్తున్నావా..............

చెప్పి చెప్పి అలసిపోయావేమో

నాన్న ఒడి అమ్మవలె వెచ్చనమ్మా

అల్లరి మాని పాలు తాగి

అలుపుతీర బజ్జోమ్మ..

నాన్నారి అమ్మా...

అందాల బొమ్మా...

మా చిన్నారి అమ్మా.....

Wednesday, July 30, 2008

తాతగారి జాబిలమ్మ
















అందరినీ తెల్లవారగానే సూర్యుడు పలకరిస్తే

మా అందరినీ మాత్రం మా చందమామ నవ్వులతో పలుకరిస్తుంది

ఎవరో కవి అన్నట్లు పగలే వెన్నెల అంటే ఇదేనేమో !!

ఇక తాతజీని చూడగానే దాని కేరింతలు మా అందరినీ ఆశ్చర్యపరుస్తాయి

ఇక ఆ తాతాజీకేమో ఏనుగు ఎక్కినంత సంబరం

ఆ సంబరంలో ఆయన వుండగానే చేతులుచాచి చంకెక్కుతుందే..

అప్పుడుచూడాలి ఎత్తుకోలేక ఆ తాతగారి తిప్పలు

ఇక ఆ తాతాజీ మనుమరాలికి పెట్టుకున్న ముద్దు పేరేమిటంటే..

"కన్నలు "

ఈ బంగారుతల్లి తాతగారిలొ ఏంత మార్పు తెచ్చింది

వావ్!!రావుగారిని చెవులు పట్టి ఆడించే మనవరాలు పుట్టిన్..దీ .....

కన్నలమ్మ.. ఓ కన్నలమ్మ..నా చిన్ని కూనలమ్మ..

తాతగారి జాబిలమ్మ ..మా ఇంటి యువరానివమ్మ..

అల్లరిచేయక బజ్జోమ్మ..మరి బజ్జోమ్మ..ఇక బజ్జోమ్మ

Tuesday, July 29, 2008

మా చందమామ


మా ఇంటిలోకి ఒక చందమామ వచ్చింది.


అద్భుతంగా...


అందరికీ మరో ప్రపంచం చూపించింది


ఆ చందమామ ఎవరో కాదు మా మొదటి మనుమరాలు ... ఫురవి మేధ



నానమ్మని అవ్వటం ఇంత అద్భుతంగా ఉంటుందా!!


దాని చిరునవ్వులు.. దాని అల్లరి కేరింతలు ..ఎత్తుకోమని చేసే గారాల పల్లవులు..


ప్రతి రోజు మాకు ఒక పండుగ రొజే.. అబ్బా ఎన్నని చెప్పాలి..


ఓ దేవుడా రోజుకి 24 గంటలే ఎందుకు ఇచ్చావు??


ఈ అమెరికా వాడు ఉండడానికి ఆరు నెలలు మాత్రమే ఎందుకు ఇస్తున్నాడు??


ఓ దేవుడా..మిగతా ఆరు నెలలు రోజుకి ఆరు గంటలే ఉంచు




నా చిన్ని తల్లి.. నా బంగారపు కొండ..నా బుడ్డి డోనూ గాడు!!


నీ బుల్లి గుప్పిట్లు ఎంత అందంగా ఉన్నాయి


మా అందరికీ దేవలోకం నుండి ఆ గుప్పిట్లనిండా ఆనందాన్ని తీసుకొచ్చావా??


అందుకేనా..పుట్టినప్పుడు నీ బుల్లి గుప్పిట్లు మూసుకుని ఉన్నాయి


ఇంత ఆనందాన్ని ఇచ్చిన నా బంగారు కొండా.. నీకు ఇవే నా ఆశీర్వచనాలు



చిన్ని తల్లీ!! నువ్వు పూర్నాయిష్కురాలివై..రత్నాల మేడల్లో..విద్యల తల్లివై


మేరు పర్వతం అంత ఎత్తుకు ఎదిగి..ఈ ధరణిలో గొప్ప పేరు తెచ్చుకొని


మా అందరి ఆశీస్సులతో


వర్ధిల్లు తల్లీ.. వర్ధిల్లు తల్లీ.. వర్ధిల్లు తల్లీ..